వైసీపీ నేత క్రాంతికుమార్ రెడ్డి మద్యం తాగి మహిళా ఉద్యోగులను దుర్భాషలాడటం దారుణం: నారా లోకేశ్
- మహిళా ఉద్యోగులపై వైసీపీ నేత క్రాంతి కుమార్ రెడ్డి దుర్భాషలాడారన్న లోకేశ్
- వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ అగ్ర నేత
- తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లిలో ఘటన
- రాఖీ సందర్భంగానైనా జగన్ ఆలోచన ధోరణిలో మార్పు రావాలని ఆకాంక్ష
మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ గురువారం వైసీపీకే చెందిన ఓ కింది స్థాయి నేత కుమారుడు మహిళా ఉద్యోగులను దుర్భాషలాడిన వైనాన్ని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లిలో సర్పంచ్ కుమారుడు వైసీపీ నేత క్రాంతి కుమార్ రెడ్డి మద్యం తాగి మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దుర్భాషలాడటం దారుణమని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన క్రాంతి కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకొని ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. రాఖీ పండుగ సందర్భంగానైనా జగన్ రెడ్డి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి మహిళలకు న్యాయం చెయ్యాలని ఆశిస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు.
ఒక్క మాధవ్ పైనైనా చర్యలు తీసుకుంటే వైసీపీలో రోజుకో మాధవ్ పుట్టుకు రావడం తగ్గుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. న్యూడ్ వీడియోలతో మహిళల్ని వేధిస్తున్న మాధవ్ లాంటి వారిపై చర్యలు తీసుకోకపోగా, అలాంటి వారిని ప్రభుత్వమే వెనకేసుకురావడం వలనే మహిళలకు వేధింపులు పెరిగిపోతున్నాయని లోకేశ్ అభిప్రాయపడ్దారు.