వెంక‌య్య‌ను వినోబా భావేతో పోల్చిన ప్ర‌ధాని మోదీ

  • బుధ‌వారం ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వెంకయ్య‌
  • వెంక‌య్య‌కు 3 పేజీల లేఖ‌ను రాసిన ప్ర‌ధాని మోదీ
  • రాజ్య‌స‌భ విలువలు కాపాడేందుకు వెంక‌య్య కృషి చేశార‌ని కితాబు
భార‌త ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి నుంచి బుధ‌వారం ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడుకు గురువారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ 3 పేజీల‌తో కూడిన‌ ఓ లేఖ రాశారు. ఈ లేఖ‌లో వెంక‌య్య‌ను ఆయ‌న వినోబా భావేతో పోల్చారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ హోదాలో కొత్త‌గా అడుగుపెట్టిన స‌భ్యుల‌ను ప్రోత్స‌హించ‌డంలో వెంక‌య్య త‌న ప్ర‌త్యేక‌త‌ను చూపార‌ని ఆ లేఖ‌లో మోదీ పేర్కొన్నారు. రాజ్య‌సభ విలువ‌లు కాపాడేందుకు వెంక‌య్య తీవ్రంగా కృషి చేశార‌ని తెలిపారు. 

అంతేకాకుండా పార్ల‌మెంటులో క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యం, స‌భ్యుల ఆందోళ‌న‌ల‌పై వెంక‌య్య ఆందోళ‌న చెందేవార‌ని కూడా మోదీ పేర్కొన్నారు. స‌భా సంప్ర‌దాయాల‌ను కాపాడ‌టంలో వెంక‌య్య త‌న‌వంతు కృషి చేశార‌ని మోదీ తెలిపారు. ఈ సంద‌ర్భంగానూ వెంక‌య్య‌ను ఆయ‌న వినోబా భావేతో పోలుస్తూ ఆకాశానికి ఎత్తారు.


More Telugu News