ఈ నెల 24న బల పరీక్షకు సిద్ధం కండి... నితీశ్ కుమార్‌కు బీహార్ గవర్నర్ ఆదేశం
- ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న నితీశ్ కుమార్
- ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- కొత్త ప్రభుత్వం బల పరీక్షపై గవర్నర్ ప్రకటన
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుని కొత్తగా కాంగ్రెస్, ఆర్జేడీతో జట్టు కట్టిన జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ నెల 24న ఆ రాష్ట్ర అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ మేరకు బీహార్ గవర్నర్ ఫగ్గూ చౌహాన్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24 నూతన సర్కారు తన బలాన్ని నిరూపించుకోవాలని ఆయన సీఎం నితీశ్‌కు సూచించారు.
గడచిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతోనే ముందుకు సాగిన నితీశ్... ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తాజాగా బీజేపీని వీడిన ఆయన తిరిగి ఆర్జేడీతో పాటు కాంగ్రెస్, మరో 5 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. తనకు మెజారిటీ ఎమ్మెల్యేల బలముందని గవర్నర్‌కు తెలిపిన నితీశ్... బుధవారం ఆర్జేడీ అగ్ర నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా గవర్నర్ ఆదేశాలతో ఈ కొత్త ప్రభుత్వం ఈ నెల 24న తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.