పోలవరం గ్రామాల్లో నివాసం లేరని ప్యాకేజీ నిరాకరణ చట్ట విరుద్ధం: ఏపీ హైకోర్టు

  • ప్యాకేజీ అంద‌లేద‌ని హైకోర్టును ఆశ్ర‌యించిన పోల‌వ‌రం వాసి జ్యోతి
  • రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌తోనే త‌న‌కు ప్యాకేజీ నిరాక‌రిస్తున్నార‌ని ఆరోప‌ణ‌
  • పిటిష‌నర్‌కు త‌క్ష‌ణ‌మే ప్యాకేజీ ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
పోల‌వ‌రం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తున్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపుల‌కు సంబంధించి దాఖ‌లైన ఓ పిటిష‌న్‌పై గురువారం ఏపీ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌తో ప్యాకేజీని నిరాక‌రిస్తున్నార‌ని ఆరోపిస్తూ పోల‌వ‌రం గ్రామానికి చెందిన జ్యోతి అనే మ‌హిళ ఈ పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. పోల‌వ‌రం వాసుల‌మైన‌ప్ప‌టికీ తాము గ్రామంలో నివాసం ఉండటం లేద‌న్న కార‌ణం చూపి ప్ర‌భుత్వం ప్యాకేజీ ఇవ్వ‌లేద‌ని ఆమె త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జరిపిన హైకోర్టు.. పోల‌వరం గ్రామాల్లో నివాసం లేర‌న్న కార‌ణంతో ప్యాకేజీ నిరాక‌ర‌ణ చ‌ట్ట విరుద్ధ‌మేన‌ని అభిప్రాయ‌ప‌డింది. అంతేకాకుండా పిటిష‌న‌ర్‌కు త‌క్ష‌ణ‌మే ప్యాకేజీ చెల్లించాల‌ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పోల‌వ‌రం ముంపు గ్రామాల‌కు చెందిన వారు ఎక్క‌డ నివాసం ఉన్నా... ప్యాకేజీ ఇవ్వాల్సిందేన‌ని కోర్టు త‌న ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది.


More Telugu News