తెలంగాణలో తొలి కేజీటూపీజీ విద్యాలయ నిర్మాణం పూర్తి... ఇవిగో ఫొటోలు
- గంభీరావుపేటలో తొలి కేజీటూపీజీ విద్యాలయం
- పూర్తి అయిన నూతన విద్యాలయం నిర్మాణం
- ఫొటోలను పోస్ట్ చేసిన రెనూవబుల్ ఎనర్జీ చైర్మన్ సతీశ్ రెడ్డి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్... రాష్ట్ర విద్యా వ్యవస్థలో నూతన విధానాలను అమలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేజీ (కిండర్ గార్టెన్) టూ పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) దాకా ఒకే చోట పూర్తి చేసుకునేలా విద్యార్థులకు నూతన విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఆ ప్రకటనకు అనుగుణంగానే తొలి కేజీటూపీజీ విద్యాలయాన్ని తెలంగాణ సర్కారు నిర్మించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని గంభీరావుపేటలో తొలి కేజీటూపీజీ విద్యాలయాన్ని నెలకొల్పింది. ఈ విద్యాలయంలోని వసతులు, భవన నిర్మాణం తదితరాలను వెల్లడిస్తూ తెలంగాణ రెనూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సతీశ్ రెడ్డి గురువారం ఓ ట్వీట్ చేశారు.