ఒడిశాలో అదానీ గ్రూపు భారీ అల్యూమినియం పరిశ్రమ

  • రాయగడలో రూ.42వేల కోట్లతో ఏర్పాటు
  • ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన
  • 4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో అల్యూమినియం రిఫైనరీ
అదానీ గ్రూపు ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ ఒడిశాలో భారీ అల్యూమినియం రిఫైనరీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.5.2 బిలియన్ డాలర్లను (సుమారు రూ.42వేల కోట్లు) ఖర్చు చేయనుంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ అనుబంధ సంస్థ ముద్రా అల్యూమినియం దీన్ని ఏర్పాటు చేయనుంది. 

గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త అన్న సంగతి తెలిసిందే. గ్రూపు వ్యాపారాలను శరవేగంగా విస్తరిస్తూ ఆయన గడిచిన రెండేళ్లలోనే తన నెట్ వర్త్ ను భారీగా పెంచుకోవడం గమనార్హం. ఒడిశాలోని రాయగడలో రూ.41,653 కోట్లతో అల్యూమినియం రిఫైనరీ, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూపునకు అనుమతి మంజూరు చేసినట్టు ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్లో ప్రకటించింది. ఈ ప్లాంట్ 4 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో ఉండనుంది.


More Telugu News