అంతర్జాతీయ స్థాయిలో 'కార్తికేయ 3'
- గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
- సీక్వెల్ గా రూపొందిన 'కార్తికేయ 2'
- ఈ నెల 13వ తేదీన సినిమా విడుదల
- 3వ పార్టు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న చందూ మొండేటి
నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2' సినిమాను రూపొందించారు. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చందూ మొండేటి మాట్లాడుతూ .. 'కార్తికేయ' కథ లోకల్ గా నడుస్తుంది .. సెకండ్ పార్టు ద్వారక నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమా హిట్ అయితే 3వ భాగం ఉంటుంది. 3వ భాగాన్ని అంతర్జాతీయస్థాయిలో ఆవిష్కరించే ఆలోచనలో ఉన్నాము. ఆ దిశగానే కథపై కసరత్తు జరుగుతోంది" అని అన్నాడు.
ఫస్టు పార్టుకు మించి సెకండ్ పార్టు ఉంటుందని ఎలా చెప్పామో .. సెకండ్ పార్టుకు మించి థర్డ్ పార్టు ఉంటుందని అంతే నమ్మకంగా చెబుతున్నాను. ఈ సినిమా తరువాత ఒక ప్రాజెక్టును గీతా ఆర్ట్స్ లో .. మరో ప్రాజెక్టును నాగార్జున గారితో చేయనున్నాను" అని చెప్పుకొచ్చాడు.