బౌల్ట్, డికాక్ వంటి ఆటగాళ్లు టెస్టులకు దూరం కావడంపై ఐసీసీ దృష్టి సారించాలి: విజయసాయిరెడ్డి
- టీ20 క్రికెట్ అంటే అందరికీ ఇష్టమేనన్న విజయసాయి
- అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టులకు దూరమవుతున్నారని వ్యాఖ్య
- ఐసీసీ చర్యలు తీసుకోవాలని సూచన
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయేతర అంశాలపై స్పందించడం అరుదైన విషయమే. తాజాగా ఆయన అంతర్జాతీయ క్రికెట్ తీరుతెన్నులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. టీ20 క్రికెట్ అంటే అందరికీ ఇష్టమేనని, అయితే ఈ ఫార్మాట్ కారణంగా ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్ వంటి పేరుమోసిన ఆటగాళ్లు టెస్టు క్రికెట్ కు దూరవుతున్నారని విజయసాయిరెడ్డి విచారం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై ఐసీసీ దృష్టి సారించాలని సూచించారు. స్వచ్ఛమైన క్రికెట్ కు ప్రతిరూపమైన టెస్టు ఫార్మాట్ కు అగ్రశ్రేణి ఆటగాళ్లు అందుబాటులో ఉండే విధంగా ఐసీసీ చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. తద్వారా క్రికెట్ వినోదం పదిలంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు.