ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • ఉదయం నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు
  • 35 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
  • 10 పాయింట్ల లాభంతో క్లోజ్ అయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకుల మధ్యే కొనసాగాయి. సూచీలు లాభ, నష్టాల్లో పయనిస్తూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. 

అంతర్జాతీయంగా మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతుండటం మన మార్కెట్లపై కూడా ప్రభావాన్ని చూపింది. అమెరికా ద్రవ్యోల్బణ డేటా విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 35 పాయింట్ల నష్టంతో 58,817కి పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 17,535కి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ 1.91%), భారతి ఎయిర్ టెల్ (1.50%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.45%), ఎల్ అండ్ టీ (1.13%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.09%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.66%), ఎన్టీపీసీ (-2.26%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.41%), విప్రో (-1.34%), ఏసియన్ పెయింట్స్ (-1. 23%).


More Telugu News