ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం తీసుకోదగిన ఆహారం
- గుమ్మడికాయతో మంచి ప్రయోజనాలు
- బ్లూబెర్రీ పండ్లు, పసుపుతో మంచి ఆరోగ్యం
- రోజుకో యాపిల్ తింటే మంచి ఫలితాలు
- గ్రీన్ టీ, ఆలీవ్ ఆయిల్ సైతం తీసుకోవాలి
వాయు కాలుష్యం, అలెర్జీ కారకాలు, తగ్గిన శారీరక కదలికలు, పోషకాహార లోపం ఇవన్నీ కలసి మనకు ప్రాణ శక్తిని అందించే ఊపిరితిత్తులు బలహీనపడేందుకు కారణం అవుతున్నాయి. ఒకప్పటితో పోలిస్తే శ్వాసకోస వ్యాధులతో బాధపడే వారి సంఖ్య నేడు గణనీయంగా పెరిగింది.
పొగతాగే అలవాటు, పర్యావరణ విష వాయువులు, శరీరంలో వాపునకు కారణమయ్యే ఆహారం తీసుకోవడం వల్ల నష్టం జరుగుతోంది. ఆస్తమా, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ), పల్మనరీ ఫైబ్రోసిస్, బ్రాంకైటిస్ ఎక్కువగా కనిపించే సమస్యలు. ఈ పరిస్థితుల్లో ఆహార పరంగా మార్పులు చేసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గుమ్మడి..
గుమ్మడికాయలో కెరటోనాయిడ్స్ అయిన కెరోటిన్, లూటిన్, జియాక్సాంతానిన్ ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్ గా, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలుగా పనిచేస్తాయి. రక్తంలో కెరటోనాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. పొగతాగే అలవాటున్న వారికి సైతం గుమ్మడికాయ తినడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే పొగతాగడం వల్ల రక్తంలో కెరటోనాయిడ్స్ ప్రభావం 25 శాతం తగ్గుతుంది. అందుకే గుమ్మడి తినాలి.
పసుపు
టర్మరిక్ (పసుపు)లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుందని వినే ఉంటారు. ఇది అక్షరాలా నిజం. ఆధునిక వైద్య శాస్త్రం సైతం పసుపులోని ఆరోగ్య గుణాలను గుర్తించింది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అన్నది అత్యంత కీలకమైన ఔషధ పదార్థం. రోజువారీ ఆహారంలో భాగంగా పసుపు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడినట్టు వైద్య పరిశోధనలు గుర్తించాయి.
బ్లూ బెర్రీలు
పోషకాల గని బ్లూబెర్రీ పండ్లు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తాయి. మాల్విడిన్, సియానిడిన్, పియోనిడిన్, డెల్ఫినిడిన్, పెటూనిడిన్ అనే యాంథోసియానిన్స్ ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల కణజాలాన్ని కాపాడతాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఎపిగాలోకాచెటిన్ గాలేట్ (ఈజీసీజీ) ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా, యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఫైబ్రోసిస్ ను నివారిస్తుంది.
పెప్పర్స్
మిరియాల్లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. కనుక ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం మిరియాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.
యాపిల్
వారంలో ఐదు లేదా అంతకు మించి యాపిల్ పండ్లను తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు గుర్తించాయి. అంతేకాదు సీవోపీడీ రిస్క్ కూడా తగ్గుతుంది. దీనికి కారణం యాపిల్ లో ఉండే విటమిన్ సీ, ఫ్లావనాయిడ్స్.
ఆలివ్ ఆయిల్
ఆలీవ్ ఆయిల్ ను తీసుకోవడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఆలివ్ ఆయిల్ లో ఎక్కువగా ఉంటాయి. కేవలం ఆలీవ్ ఆయిల్ నే ఆహారంలో భాగంగా తీసుకునే వారికి ఆస్తమా రిస్క్ తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
బార్లీ
బార్లీలో పోషకాలు ఎక్కువ. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడేందుకు ఈ పోషకాలు సాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్ అయిన ఫ్లావనాయిడ్స్, విటమిన్ ఈ ఇందులో ఉన్నాయి.