శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద... 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

  • ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3.64 లక్షల క్యూసెక్కులు
  • 10 అడుగుల మేర గేట్లు ఎత్తిన అధికారులు
  • దిగువకు 3.39 లక్షల క్యూసెక్కుల విడుదల
  • కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పాదన
ఎగువన కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 3,64,683 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టులో 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్ ఫ్లో 3,39,948 క్యూసెక్కులుగా ఉంది. 

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.30 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 211 టీఎంసీల నీరు ఉంది. నీరు దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.


More Telugu News