టెస్లాలో 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు అమ్మేసిన మస్క్

  • అత్యవసరంగా విక్రయంచే పరిస్థితి రాకూడదనే 
    అమ్మేసినట్టు వెల్లడి 
  • ట్విట్టర్ కొనుగోలు నుంచి తప్పుకున్న ప్రపంచ కుబేరుడు
  • మస్క్ పై న్యాయ పోరాటం చేస్తున్న ట్విట్టర్ 
ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తన కంపెనీలో 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. మున్ముందు అత్యవసరంగా షేర్లు విక్రయించే పరిస్థితిని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచ కుబేరుడైన మస్క్ 44 బిలియన్ల డాలర్లతో ట్విట్టర్ ను కొనుగులు చేయాలనే డీల్ నుంచి తప్పుకొని ప్రస్తుతం ఆ కంపెనీతో న్యాయ పోరాటం ఎందుర్కొంటున్నారు. 

మస్క్ ఈ డీల్ నుంచి ఉన్నట్టుండి తప్పుకోవడంపై నష్టపరిహారం చెల్లించాలని ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. ప్రతిగా మస్క్ కూడా దావా వేశారు. దీనిపై అక్టోబర్ 17నుంచి విచారణ ప్రారంభం కానుంది. న్యాయ పోరాటం కోసం మస్క్ పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ ఏప్రిల్లోనూ టెస్లా కంపెనీలో 8.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను మస్క్ విక్రయించారు. కానీ, తదుపరి ఎలాంటి షేర్లు అమ్మేది లేదని అప్పుడు చెప్పారు. అయితే, ట్విట్టర్ తో న్యాయపోరాటంలో ఓడిపోయి ఆ కంపెనీ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చినా లేదా జరిమానా చెల్లించాల్సి వచ్చినా టెస్లా షేర్లను విక్రయించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈనెల 5-9 మధ్య మస్క్ తన పేరిట ఉన్న పేర్లలో 7.92 మిలియన్ల షేర్లను అమ్మేశారు. ప్రస్తుతం టెస్లాలో ఆయన మరో 155.04 మిలియన్ షేర్లు కలిగి ఉన్నారు.


More Telugu News