బీహార్ లో బీజేపీ అజెండా అమలు కాకూడదన్నదే మా అందరి కోరిక: తేజస్వి యాదవ్
- బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
- బీజేపీతో జేడీయూ సంకీర్ణం విచ్ఛిన్నం
- ఆర్జేడీతో జతగా జేడీయూ కొత్త భాగస్వామ్యం
- ఏడు పార్టీలతో 'మహాగత్ బంధన్' కూటమి
బీహార్ లో రాజకీయాలు వేడెక్కాయి. నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తేజస్వి యాదవ్ తో కలిసి మంతనాలు సాగించడం, గవర్నర్ కు ప్రతిపాదనలు వివరించడం తెలిసిందే. ఈ క్రమంలో, ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు.
తమ పూర్వీకుల వారసత్వాన్ని తమ నుంచి ఎవరూ లాగేసుకోలేరని స్పష్టం చేశారు. బీజేపీ అజెండా బీహార్ లో అమలు కాకూడదన్నదే తామందరి అభిమతం అని తేల్చిచెప్పారు. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని వివరించారు. నాడు అద్వానీ రథాన్ని లాలూజీ నిలువరించిన విషయం అందరికీ తెలుసని తేజస్వి అన్నారు. పశ్చాత్తాప పడే పనులు తాము చేయడంలేదని పేర్కొన్నారు.
ఇప్పుడు బీజేపీతో సంకీర్ణం విచ్ఛిన్నమైన నేపథ్యంలో, జేడీయూ, ఆర్జేడీలతో కలిసి ఏడు పార్టీల మహాగత్ బంధన్ (మహా కూటమి) ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడు పార్టీలకు ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా జత కలవనున్నాడు. కాగా, కొత్త ప్రభుత్వం ఏర్పడితే నితీశ్ కుమార్ కు సీఎం పదవి, తేజస్వికి డిప్యూటీ సీఎం పదవి, స్పీకర్ పదవికి ఆర్జేడీకి ఇచ్చేట్టు సూత్రప్రాయ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.