బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
- గవర్నర్ కు రాజీనామా లేఖ ఇచ్చిన నితీశ్
- రాజీనామా చేసినట్టు ప్రకటన
- రబ్రీదేవి నివాసంలో కీలక భేటీ
- జేడీయూ, ఆర్జేడీ కొత్త భాగస్వామ్యంతో ప్రభుత్వం!
- నితీశ్ సీఎంగా, తేజస్వి డిప్యూటీ సీఎంగా నూతన సర్కారు!
బీహార్ లో రాజకీయ సంచలనం చోటుచేసుకుంది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలకు పరాకాష్ఠగా నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. గవర్నర్ తో భేటీ అనంతరం ఆయన తన రాజీనామా విషయాన్ని నిర్ధారించారు.
రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించినట్టు తెలిపారు. బీజేపీతో సంకీర్ణ భాగస్వామ్యం తెగదెంపులు చేసుకున్నట్టు ప్రకటించిన కాసేపటికే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయ కలకలం రేపింది.
కాగా, ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ తో మాట్లాడేందుకు నితీశ్ కుమార్... మాజీ సీఎం, ఆర్జేడీ శాసనసభాపక్ష నేత రబ్రీదేవి నివాసానికి చేరుకున్నారు. జేడీయూ, ఆర్జేడీ కొత్త భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడితే నితీశ్ కుమార్ సీఎంగా రబ్రీదేవి అంగీకరించినట్టు తెలుస్తోంది. తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం అవుతారని బీహార్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.