మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు హర్షకుమార్ కుమారుడిపై కేసు నమోదు

మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు హర్షకుమార్ కుమారుడిపై కేసు నమోదు
  • ముద్దు పెట్టేందుకు యత్నించాడంటూ మహిళ ఫిర్యాదు
  • సెక్షన్ 509, 354 కింద కేసు నమోదు
  • ఘటనపై ఇంకా స్పందించని హర్షకుమార్ కుమారుడు శ్రీ రాజ్
మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ పై పోలీసు కేసు నమోదైంది. కోరుకొండ మండలం గుడాల గ్రామంలో ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలతో కోరుకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన నేపథ్యంలో... సెక్షన్ 509, 354ల కింద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. 

తనకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఈ ఘటనపై శ్రీరాజ్ ఇంకా స్పందించలేదు.


More Telugu News