నీటిలోపల మెట్రో స్టేషన్.. కోల్ కతాలో నిర్మితమవుతున్న ప్రాజెక్టు

  • హుగ్లీ నదిలో ఈస్ట్-వెస్ట్ కారిడార్ 
  • 2023 జూన్ నాటికి పూర్తి
  • ఇప్పటికే 9.30 కిలోమీటర్ల నిర్మాణం
ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన ఎన్నో నిర్మాణ విశిష్టతలు మనదేశంలోనూ ఒక్కొక్కటిగా సాకారమవుతున్నాయి. నీటి లోపల మెట్రో స్టేషన్ చూడాలంటే, విదేశాలకు వెళితే తప్ప దేశవాసులకు సాధ్యమయ్యేది కాదు. కానీ, త్వరలో మన దేశంలోనూ ఇలాంటి అండర్ వాటర్ మెట్రో సర్వీసు కోల్ కతాలో అందుబాటులోకి రాబోతోంది. హుగ్లీ నది లోపల నిర్మిస్తున్న ఈస్ట్-వెస్ట్ కారిడార్ ప్రాజెక్టు 2023 జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని కోల్ కతా మెట్రో రైలు కార్పొరేషన్ చెబుతోంది.

కోల్ కతా మీదుగా సాల్ట్ లేక్, హౌరా మధ్య ఈ ప్రాజెక్టు నిర్మితం అవుతోంది. మొత్తం 16.55 కిలోమీటర్ల పొడవునా ఉండే ఈ మార్గంలో 9.30 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేసుకుంది. మిగిలిన 7.25 కిలోమీటర్ల రైలు మార్గ నిర్మాణ పనులు ఏడాదిలోపు పూర్తి కానున్నాయి. దీంతో ప్రయాణ సమయం చాలా వరకు తగ్గనుంది. ఇక నీటిలోపల రైలులో ప్రయాణిస్తూ చూసే అందాలు అద్భుతంగా ఉండనున్నాయి. హుగ్లీ నది లోపల 500 మీటర్ల పాటు మెట్రో లైన్ ఉంటుంది.


More Telugu News