జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు వెళ్లిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవరాలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
- జ్ఞానవాపి మసీదులో జలాభిషేకం చేస్తానని ప్రకటించిన రాజ్యశ్రీ చౌదరి
- అనుమతించేది లేదన్న స్థానిక అధికారులు
- రైలులో వారణాసి బయలుదేరిన రాజ్యశ్రీని ప్రయాగ్‌రాజ్ వద్ద అడ్డుకున్న పోలీసులు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవరాలు రాజ్యశ్రీ చౌధరిని పోలీసులు నిర్బంధించారు. అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ అధ్యక్షురాలైన రాజ్యశ్రీ గతవారం ఓ ప్రకటన చేస్తూ.. జ్ఞానవాపి మసీదు వద్ద జలాభిషేకం చేస్తానని ప్రకటించారు. అయితే జలాభిషేకానికి ఆమెను అనుమతించేది లేదని స్థానిక అధికారులు తేల్చి చెప్పారు.
మరోవైపు, జ్ఞానవాపి మసీదులో జలాభిషేకం నిర్వహించేందుకు రాజ్యశ్రీ నిన్న రైలులో వారణాసి బయలుదేరారు. విషయం తెలిసిన పోలీసులు ప్రయాగ్‌రాజ్ రైల్వేస్టేషన్‌లో ఆమెను అడ్డుకుని కిందికి దించారు. అనంతరం నిర్బంధంలోకి తీసుకున్నారు.