అమరావతిని మార్చడం సాధ్యం కాదని విజయసాయికి అర్థమైంది: రఘురామకృష్ణరాజు
- మూడు రాజధానుల ఏర్పాటు తమ వల్ల కాదని విజయసాయి చెప్పకనే చెప్పారన్న రఘురామ
- పార్లమెంటులో ఇప్పటివరకు రెండు ప్రైవేటు బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయన్న నర్సాపురం ఎంపీ
- జగన్‌పైనా విమర్శలు
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా, పోలవరం నిధుల గురించి మాట్లాడనే లేదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మాతృభాషలోనే పిల్లలకు విద్యను బోధించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే జగన్ మాత్రం ఏకంగా ప్రాథమిక పాఠశాలలనే ఎత్తేసే పనిలో ఉన్నారని విమర్శించారు.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టడంపై రఘురామ స్పందిస్తూ.. అమరావతిని తరలించడం తమ వల్ల కాదని విజయసాయికి అర్ధమైందని ఎద్దేవా చేశారు. అందుకే ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటు ఆమోదం పొందాలని కోరుతున్నారని విమర్శించారు. అమరావతిని కదిలించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. పార్లమెంటులో ఇప్పటి వరకు రెండు ప్రైవేటు మెంబరు బిల్లులు మాత్రమే పాసైనట్టు రఘురామరాజు గుర్తు చేశారు.