'బింబిసార' నాకు పునర్జన్మనిచ్చింది: కల్యాణ్ రామ్
- 'బింబిసార'గా మెప్పించిన కల్యాణ్ రామ్
- విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లు
- ప్రెస్ మీట్ లో హర్షాన్ని వ్యక్తం చేసిన కల్యాణ్ రామ్
- కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారంటూ వ్యాఖ్య
'బింబిసార' సినిమాతో కల్యాణ్ రామ్ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. థియేటర్లకు జనాలు రావడం లేదని ఇండస్ట్రీ పెద్దలు ఆలోచనలోపడిన పరిస్థితుల్లో ఈ సినిమా విజయాన్ని సాధించడం ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం తాను పడిన టెన్షన్ ను గురించి చెప్పుకొచ్చాడు.
"ఈ సినిమా షూటింగు మొదలుపెట్టిన 5వ రోజునే లాక్ డౌన్ పెట్టారు. మళ్లీ మేము 3 నెలల తరువాత షూటింగుకి వెళ్లాము. అలా కొన్ని రోజులు షూటింగు చేయగానే సెకండ్ వేవ్ అన్నారు. సినిమాను పూర్తిచేసి విడుదల చేద్దామని అనుకుంటూ ఉండగా, జనాలు థియేటర్ కి రావడం లేదని అనడం మొదలుపెట్టారు. దాంతో మళ్లీ టెన్షన్ మొదలైంది .. ఏం చేయాలో పాలుపోలేదు.
ఇంతకాలాన్ని కేటాయించి .. ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు అవాంతరాలు ఎదురైనప్పుడు సహజంగానే భయం ఉంటుంది. మరో మూలన మంచి కంటెంట్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే ఒక నమ్మకం కూడా నాకు ఉండేది .. చివరికి ఆ నమ్మకమే నిజమైంది. ఈ సినిమా గురించి అందరూ గొప్పగా చెబుతుంటే .. ఇది నాకు రీ బర్త్ ఇచ్చిందని అనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు.