కామన్వెల్త్ గేమ్స్: బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పీవీ సింధుకు స్వర్ణం

  • బర్మింగ్ హామ్ లో కామన్వెల్త్ క్రీడలు
  • ఏకపక్షంగా బ్యాడ్మింటన్ ఫైనల్
  • కెనడా అమ్మాయి మిచెల్లీ లీని చిత్తుచేసిన సింధు
  • వరుస గేముల్లో విజయం
  • భారత్ ఖాతాలో మరో స్వర్ణం
తెలుగుతేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పసిడి పతకం సాధించింది. ఇవాళ జరిగిన ఫైనల్స్ లో సింధు అద్భుతంగా ఆడి కెనడాకు చెందిన మిచెల్లీ లీపై ఘనవిజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో సింధు 21-15, 21-13 తో అలవోకగా నెగ్గింది. 

బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ అంశంలో సింధుపై మొదటి నుంచి పసిడి ఆశలు ఉన్నాయి. ఆమె తప్పకుండా స్వర్ణం సాధిస్తుందని భారత శిబిరం నమ్మకం ఉంచింది. అటు అభిమానులు కూడా సింధు కామన్వెల్త్ స్వర్ణం అందుకోవాలని ఆకాంక్షించారు. అందరి అంచనాలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ సింధు కామన్వెల్త్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేతగా అవతరించింది. 

కాగా, కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధుకు ఇదే తొలి స్వర్ణ పతకం. ఈ పతకంతో బర్మింగ్ హామ్ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 56కి పెరిగింది.


More Telugu News