ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుపతికి వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుపతికి వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం
  • మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తున్న కుటుంబం
  • కంభం సమీపంలో లారీని ఢీకొట్టిన కారు
  • బాధితులది సిరిగిరిపాడుగా గుర్తింపు
ప్రకాశం జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తున్న కారు కంభం సమీపంలో ఓ లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. 

కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55), ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24)గా గుర్తించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News