తనకు, భార్య అక్షత మూర్తికి మధ్య తేడా వివరించిన రిషి సునాక్
- బ్రిటన్ ప్రధాని పదవికి పోటీపడుతున్న రిషి సునాక్
- లిజ్ ట్రస్ తో అమీతుమీ
- ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
- భార్యపై చిరుకోపం
బ్రిటన్ ప్రధాని రేసులో నిలిచిన భారత సంతతి రాజకీయనేత రిషి సునాక్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు వెల్లడించారు. తనకు, తన భార్య అక్షత మూర్తికి గల తేడాలను వివరించారు. తాను ఎంతో ఒద్దికగా ఉంటానని, కానీ అక్షత మూర్తి గజిబిజి గందరగోళం మనిషి అని వివరించారు.
తాను ప్రతిదీ పక్కాగా ప్రణాళికతో ఉండేలా చూసుకుంటానని, కానీ అక్షత మూర్తి అప్పటికప్పుడు అనుకుని చేసేస్తుంటుందని వెల్లడించారు. ఇంటిని చక్కగా ఉంచే విషయంలో ఆమె గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిదని, ఈ విషయం చెబుతున్నందుకు ఆమె తనను ఎంతగా తిట్టుకుంటుందో తనకు తెలుసని రిషి సునాక్ చమత్కరించారు.
"ఇంటినిండా చిందరవందరగా బట్టలు, ఎక్కడిపడితే అక్కడ బూట్లు... దేవుడా!" అంటూ భార్యను గుర్తుచేసుకుని తలపట్టుకున్నారు. అయితే, తామిద్దరం ఇలా పరస్పరం భిన్నమైన వ్యక్తులం కావడం వల్లే తమ ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందని భావిస్తున్నట్టు సునాక్ అభిప్రాయపడ్డారు.
రిషి సునాక్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తుండగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షత మూర్తి పరిచయం అయింది. ఈ జోడీ 2006లో బెంగళూరులో పెళ్లితో ఒక్కటైంది. వీరికి కృష్ణ (11), అనౌష్క (9) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.