ఐస్‌ ల్యాండ్‌ అగ్ని పర్వతం పేలుతోంది.. లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇదిగో..!

  • భారీగా వెలువడుతున్న లావా, ధూళి, విష వాయువులు..
  • అప్పుడప్పుడూ ధూళి, దట్టమైన పొగల కారణంగా మబ్బుగా ఉంటున్న లైవ్ వీడియో
  • కాస్త వెనక్కి జరిపి చూసుకుంటే.. లావా పేలుళ్లను చూడవచ్చని చెప్పిన ఐస్ ల్యాండ్ మీడియా సంస్థ
భూమ్మీద చాలా చోట్ల అగ్ని పర్వతాలు ఉన్నాయి. అందులో కొన్ని మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంటాయి. తరచూ లావాను, దుమ్ము, ధూళి, పొగలను వెదజల్లుతూ ఉంటాయి. అలా ఐస్ ల్యాండ్ లోని రెండు అగ్ని పర్వతాలు కొంత కాలం నుంచి బాగా యాక్టివ్ గా ఉన్నాయి. ఇటీవలే ఐస్ ల్యాండ్ రాజధానికి దగ్గరలో ఉన్న రేకజావిక్ అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున లావాను వెదజల్లింది. తాజాగా ఆగస్టు 3న గ్రిండావిక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఫగ్రడాల్సిఫ్జల్ అగ్నిపర్వతం లావాను వెదజల్లడం మొదలైంది. కుతకుత ఉడుకుతూ.. లావాను, దట్టమైన పొగలను వెదజల్లుతోంది.

స్థానిక మీడియా చానల్ లో..
ఫగ్రడాల్సిఫ్జల్ అగ్ని పర్వతం పేలుతున్న దృశ్యాన్ని ఐస్ ల్యాండ్ కు చెందిన ఎంబీఎల్.ఐఎస్ మీడియా సంస్థ యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టింది. కుతకుతా ఉడుకుతున్న లావా, కిలోమీటర్ల పొడవునా ఎర్రగా కణకణమంటూ కొనసాగుతున్న ప్రవాహం, భారీగా వెలువడుతున్న ధూళి, పొగలు లైవ్ లో కనిపిస్తున్నాయి. 
  • అయితే అగ్నిపర్వతం నుంచి అప్పుడప్పుడు భారీగా పొగలు వెలువడుతుండటంతో కెమెరాలకు అడ్డుగా వచ్చి మబ్బుగా కనిపిస్తోందని.. తర్వాత గాలులు వీచినప్పుడు క్లియర్ అవుతోందని ఎంబీఎల్ మీడియా సంస్థ తెలిపింది.
  • లైవ్ వీడియోను వెనక్కి జరిపి చూస్తుంటే.. అగ్ని పర్వతం లావా పేలుళ్లను బాగా చూడవచ్చని పేర్కొంది.
  • అయితే ఎవరూ కూడా అగ్ని పర్వతాన్ని చూడటానికి సమీపంలోకి వెళ్లవద్దని.. చాలా యాక్టివ్ గా లావా పేలుళ్లు, విష వాయువులు వెలువడుతున్నాయని ఐస్ ల్యాండ్ అధికారులు హెచ్చరించారు.
  • రెండు రోజుల కింద ముగ్గురు పర్యాటకులు అగ్ని పర్వతాన్ని వీక్షించడానికి వెళ్లగా.. గాలిలోకి ఎగిసిన లావా పడటంతో తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
  • ఒక్కోసారి అకస్మాత్తుగా విష పూరిత వాయువులు వెలువడతాయని.. ఊపిరాడక ప్రాణాపాయం తలెత్తే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.
 


More Telugu News