కేటీఆర్ చాలెంజ్ ను స్వీకరించి... చంద్రబాబు, బాలినేనిలను నామినేట్ చేసిన పవన్ కల్యాణ్

  • నేడు జాతీయ చేనేత దినోత్సవం
  • చేనేత దుస్తులు ధరించిన ఫొటోలు పోస్టు చేయాలన్న కేటీఆర్
  • ఓకే చెప్పిన పవన్ కల్యాణ్
  • నేతన్నలపై తనకు ప్రేమాభిమానాలున్నాయని వెల్లడి
తెలంగాణ మంత్రి కేటీఆర్ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో చేనేత ఉత్పత్తుల వినియోగం చాలెంజ్ లో పాలుపంచుకున్నారు. ప్రతివారం చేనేత దుస్తులు ధరిస్తానని, చేనేతకు ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, జనసేనాని పవన్ కల్యాణ్ లను నామినేట్ చేశారు. ఈ చేనేత చాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా కోరారు. చేనేత దుస్తులు ధరించిన ఫొటోలు పోస్టు చేయాలని సూచించారు. 

దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. రామ్ భాయ్ విసిరిన చాలెంజ్ ను స్వీకరిస్తున్నానని వెల్లడించారు. ఈ చాలెంజ్ ను స్వీకరించడానికి చేనేత కార్మికుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలే కారణమని పవన్ తెలిపారు. ఇప్పుడు తాను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ లను నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. చేనేత దుస్తులు ధరించిన ఫొటోలు పోస్టు చేసి జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్నలపై ప్రేమాభిమానాలను చాటుకోవాలని పేర్కొన్నారు.


More Telugu News