వాయవ్య బంగాళాఖాతంలో మరింత బలపడనున్న అల్పపీడనం
- వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- రేపటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం
- ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు
- 45 నుంచి 55 కిమీ వేగంతో గాలులు
వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఇదే ప్రాంతంలో నిన్న అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా వెల్లడించారు. ఈ అల్పపీడనం సోమవారం నాటికి మరింత బలపడుతుందని తెలిపారు.
ఇది క్రమేపీ పశ్చిమంగా పయనిస్తుందని, దీని ప్రభావంతో నేడు (ఆదివారం) ఉత్తరకోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్టెల్లా వివరించారు. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. అటు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.