ఐఫోన్ 14.. పూర్తిగా మేడిన్ ఇండియా!
- పూర్తి స్థాయిలో భారత్ లోనే తయారు చేయించొచ్చన్న అంచనాలు
- భారత్ లో ఇప్పటికే ఐఫోన్ 11, 12, 13, ఎస్ఈ తయారీ
- అయినా గరిష్ఠ స్థాయిల్లోనే ధరలు
యాపిల్ ఈ ఏడాది తీసుకురానున్న ఐఫోన్ 14ను పూర్తిగా భారత్ లోనే తయారు చేయించనుంది. ఎప్పటి మాదిరే వచ్చే నెలలో ఐఫోన్ 14 విడుదల కార్యక్రమం ఉంటుందని అంచనా. యాపిల్ ఇప్పటికే భారత్ లోని తన కాంట్రాక్టు సంస్థలైన ఫాక్స్ కాన్, విస్ట్రన్ సంస్థలతో ఐఫోన్ 11, 12, 13, ఎస్ఈ మోడళ్లను తయారు చేయిస్తోంది. కానీ, ఇవే మోడళ్లను చైనాలోనూ తయారు చేయిస్తోంది. ప్రముఖ అనలిస్ట్ మింగ్ చీ కువో చెబుతున్న దాని ప్రకారం.. ఐఫోన్ 14ను యాపిల్ పూర్తిగా భారత్ లోనే తయారు చేయించనుంది.
ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడళ్లు వచ్చే నెలలో విడుదల కానున్నాయి. భారత్ లో తయారు చేయడం వల్ల వీటి ధరలు తక్కువగా ఉంటాయా? అంటే కాదనే సమాధానమే వస్తోంది. ఐఫోన్ 13 సిరీస్ కు ఆరంభంలో నిర్ణయించినట్టుగా 799 డాలర్లు లేదంటే ఇంకా ఎక్కువకే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల ధరలు మొదలు కానున్నాయని అంచనా. అంటే సుమారు రూ.64వేల నుంచి ధరలు ఉండొచ్చు. నిజానికి యాపిల్ ఐఫోన్ల తయారీని భారత్ లో మొదలు పెడితే ధరలు అందుబాటులోకి వస్తాయని ఎక్కువ మంది ఆశించారు. కానీ, అదేమీ ఆచరణలో జరగలేదు. ధరలు తగ్గించి ప్రపంచంలో ప్రీమియం బ్రాండ్ గా తనకున్న గుర్తింపును యాపిల్ త్యాగం చేసుకునే స్థితిలో లేదని అర్థమవుతోంది.