మీరీ మధ్య ఢిల్లీ రావడం మానేశారు: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన బాబు
- ఐదు నిమిషాలపాటు మాట్లాడుకున్న మోదీ-బాబు
- చంద్రబాబు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వైనం
- ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానన్న బాబు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు నిన్న ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో ఐదు నిమిషాలపాటు మాట్లాడిన ప్రధానిమంత్రి నరేంద్రమోదీ అప్పుడప్పుడు ఢిల్లీ వస్తూ ఉండాలని సూచించారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక మందిరంలో జరిగిన సమావేశం ముగిశాక, చంద్రబాబు-ప్రధాని ఐదు నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.
సమావేశం ముగిసిన తర్వాత ఐదు నిమిషాలపాటు చంద్రబాబుతో మాట్లాడిన మోదీ.. ఈ మధ్య ఢిల్లీకి రావడం మానేశారని, అప్పుడప్పుడు వస్తూ ఉండాలని అన్నారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ.. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని చెప్పారు. దీనికి ప్రధాని.. తప్పకుండా రావాలని, ఇది మీ ఇల్లు అనుకోవాలని, రావాలనుకున్నప్పుడు తొలుత తమ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తోంది. అలాగే, చంద్రబాబు కుటుంబ సభ్యుల యోగక్షేమాలను కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ తదితరులతోనూ చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి.