ముగిసిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్... 93 శాతం పోలింగ్ నమోదు
- ఓటేసిన 725 మంది ఎంపీలు
- మరికాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు
- ధన్‌కర్‌కే గెలుపు అవకాశాలంటూ విశ్లేషణలు
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ముగిసింది. పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌లో కేవలం 93 శాతం (725) మంది ఎంపీలు మాత్రమే ఓటేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ రాత్రికే ఫలితం కూడా వెల్లడి కానుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కడ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఉన్న అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థి ధన్‌కడే విజయం సాధించే అవకాశాలున్నాయి. అధికార ఎన్డీఏతో పాటు పలు ఇతర పార్టీలు కూడా ధన్‌కడ్ కు మద్దతు ప్రకటించాయి.