కరోనా బారిన పడ్డ కర్ణాటక సీఎం బొమ్మై... త్వరగా కోలుకోవాలంటూ డీకే అరుణ ఆకాంక్ష
- మరణాలు తగ్గినా కొనసాగుతున్న కరోనా విస్తరణ
- స్వల్ప లక్షణాలతో ఐసోలేషన్‌లోకి వెళ్లిన బొమ్మై
- తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్న కర్ణాటక సీఎం
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విస్తరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ కారణంగా మరణాలు కాస్తంత తగ్గినా... ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య దేశంలో ఇంకా వేలల్లోనే నమోదవుతోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు.
తనకు కరోనా సోకిందని, స్వల్ప లక్షణాలు కనిపించిన నేపథ్యంలో వైద్య పరీక్ష చేయించుకోగా కరోనాగా నిర్ణారణ అయ్యిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తన ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పిన బొమ్మై... తనను ఇటీవల కలిసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే... కరోనా బారిన పడ్డ బొమ్మై త్వరగా కోలుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆకాంక్షించారు. బొమ్మైకి ఆరోగ్యం ప్రసాదించాలని ఆమె జోగులాంబను వేడుకున్నారు.