'పుష్ప 2' ఓటీటీ రైట్స్ కోసం పెరుగుతున్న పోటీ!
- 'పుష్ప 2'పై జరుగుతున్న కసరత్తు
- వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
- వెయ్యి కోట్ల వసూళ్లను టార్గెట్ గా పెట్టుకున్న టీమ్
- ముఖ్యమైన పాత్రలో సమంత కనిపించే ఛాన్స్
అల్లు అర్జున్ - సుకుమార్ ఇద్దరూ కూడా 'పుష్ప 2' సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ వరకూ కేటాయించి రంగంలోకి దిగుతున్నారట. వెయ్యి కోట్ల వరకూ వసూళ్లను టార్గెట్ గా పెట్టుకున్నట్టు వినికిడి.
ఈ సినిమా ఫస్టు పార్టు స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకున్నారు. సెకండ్ పార్టు స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా వారే సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట. అయితే అంతకంటే ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తూ మిగతా ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయట. అందువలన డిజిటల్ రైట్స్ విషయంలోను ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు.
ఈ సారి ఈ సినిమాను మారేడుమిల్లి ఫారెస్టు తో పాటు కొంత భాగాన్ని ఫారిన్ లోను తీయనున్నట్టుగా సమాచారం. ఇక సమంతకు కూడా ముఖ్యమైన పాత్ర దక్కిందని అంటున్నారు. కొత్తగా తీసుకున్నవారి జాబితాలో మనోజ్ బాజ్ పాయ్ .. విజయ్ సేతుపతి .. ప్రియమణి పేర్లు కనిపిస్తున్నాయి. ఇక పాటల పరంగా కూడా అంతకుమించి అనేలా చూస్తున్నారట.