కాబూల్‌లో పేలుడు.. 8 మంది మృతి: ఆ పని తమదేనన్న ఐఎస్

  • దేశంలోని అతిపెద్ద మైనారిటీ అయిన  హజరాస్‌ మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడి
  • తీవ్రంగా గాయపడిన మరో 18 మంది
  • శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడిన ఐఎస్
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోమారు రక్తమోడింది. శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 18 మంది గాయపడ్డారు. ఈ పేలుడు తమ పనేనని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

ఆఫ్ఘనిస్థాన్ స్థానిక మీడియా ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌లోని అతిపెద్ద మైనారిటీ అయిన హజారాస్ జాతిని లక్ష్యంగా చేసుకుని ఐఎస్ ఈ దాడికి పాల్పడింది. మసీదు వద్ద ప్రార్థనల కోసం వచ్చిన మహిళలు, చిన్నారులను టార్గెట్‌గా చేసుకుని దాడికి పాల్పడింది. మొత్తం రెండు పేలుళ్లు జరగ్గా ఒకటి సర్-ఇ-కరిజ్ ప్రాంతంలోని ఇమామ్ బాకిర్ అనే మహిళా మసీదులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారని ప్రభుత్వం చెబుతుండగా, చనిపోయింది 20 మందని ఇస్లామిక్ స్టేట్ తెలిపింది.


More Telugu News