దురదృష్టవశాత్తు కేసీఆర్ కు ఆరోజు దాసోజు శ్రవణ్ మంచివాడిలా కనిపించారు: బండి సంజయ్

  • తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు
  • కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కోమటిరెడ్డి, దాసోజు శ్రవణ్
  • ఒక్కరోజు తేడాలో పార్టీని వీడిన నేతలు
  • ఈ నెల 21న బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి
  • శ్రవణ్ ను సొంతగూటికి రావాలన్న బండి సంజయ్
తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కోమటిరెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేరనుండగా, దాసోజు శ్రవణ్ కూడా బీజేపీలోకి రావాలంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆహ్వానం పలికారు. 

దాసోజు శ్రవణ్ జాతీయ భావాలున్న వ్యక్తి అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా వ్యవహరించారని వెల్లడించారు. దురదృష్టం ఏమిటంటే, ఆనాడు కేసీఆర్ కు శ్రవణ్ చాలా మంచివాడిలా కనిపించారని, కానీ ప్రజల్లో శ్రవణ్ కు ఆదరణ లభిస్తుంటే భరించలేక ఆయనను అణగదొక్కారని బండి సంజయ్ విమర్శించారు. దాసోజు శ్రవణ్ గతంలో ఏబీవీపీ తరఫున పలు ఉద్యమాల్లో పాల్గొన్నారని, ఆయన తన సొంత గూటికి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.


More Telugu News