రాజాం నియోజకవర్గ వైసీపీ నేతలతో సీఎం జగన్ సమావేశం... ఫొటోలు ఇవిగో
- విజయనగరం జిల్లా రాజాం పార్టీ శ్రేణులతో జగన్ భేటీ
- రాజాం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కంబాల జోగులు
- జోగులును మరోమారు గెలిపించాలని జగన్ పిలుపు
రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ శ్రేణులతో సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి రాజాం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైసీపీ నేత కంబాల జోగులుతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన 50 మంది పార్టీ కీలక నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కంబాల జోగులును మరోమారు గెలిపించాలని ఆయన సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి మరింత మేర నిధులు మంజూరు చేయనున్నట్లు జగన్ తెలిపారు. ఈ తరహా భేటీల్లో భాగంగా గురువారం కుప్పం నియోజకవర్గ నేతలతో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే.