రాజ్యసభలో విజయసాయిరెడ్డి 3 ప్రైవేట్ బిల్లుల ప్రతిపాదన... ఒకటి కంటే ఎక్కువ రాజధానులపై రాష్ట్ర అసెంబ్లీకి అధికారం ఇచ్చేలా ఓ బిల్లు
- అరెస్టయిన ఎంపీ, ఎమ్మెల్యేలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాలుపంచుకునేలా బెయిల్ ఇవ్వాలని ప్రతిపాదన
- ఏకపక్ష వార్తలు రాసే సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రెస్ కౌన్సిల్‌కు అధికారం ఇవ్వాలని మరో బిల్లు
- డిజిటల్ మీడియాను కూడా ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదన
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మూడు ప్రైవేట్ బిల్లులను ప్రతిపాదించారు. దేశంలోని ఏదేని రాష్ట్రానికి ఒకటి అంతకంటే ఎక్కువ రాజధానులను ఏర్పాటు చేసే అధికారాన్ని ఆయా రాష్ట్రాల శాసనసభలకే కట్టబెట్టేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఉంది. ఇక రెండో బిల్లు విషయానికి వస్తే... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు సహా ఇతర రాజ్యాంగబద్ధ ఎన్నికల్లో పాలుపంచుకునేలా ఎంపీలు, ఎమ్మెల్యేలకు తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాలని రెండో బిల్లులో సాయిరెడ్డి ప్రతిపాదించారు.
ఇక మూడో బిల్లు విషయానికి వస్తే... అసత్య వార్తలు ప్రచురించే మీడియా సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సర్వాధికారాలు కట్టేబెట్టేందుకు ఉద్దేశించిన మరో బిల్లును సాయిరెడ్డి ప్రతిపాదించారు. అంతేకాకుండా డిజిటల్ మీడియాను కూడా ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలని సాయిరెడ్డి ప్రతిపాదించారు. ఈ బిల్లులో 'ఆల్ బయాస్‌డ్ న్యూస్' వార్తలు ప్రసారం చేసే ఛానెళ్లు అంటూ పేర్కొన్న ఆయన వాటిని సంక్షిప్తంగా 'ఏబీఎన్ ఛానెల్స్'గా పేర్కొన్నారు.