ఫిలిం చాంబర్ల ప్రతినిధులతో మంత్రి తలసాని సమావేశం
- తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
- ఈ నెల 8 నుంచి కార్యాచరణ
- తలసాని సమీక్ష సమావేశం
- హాజరైన తెలంగాణ, తెలుగు ఫిలిం చాంబర్ల ప్రతినిధులు
తెలంగాణలో ఆగస్టు 8 నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం చాంబర్ ప్రతినిధులతోనూ, ఫిలిం డెవలప్ మెంట్ శాఖ అధికారులతోనూ సమీక్షా సమావేశం చేపట్టినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణ, విధివిధానాలు తదితర అంశాలపై చర్చించినట్టు తలసాని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, ఫిలిం చాంబర్ కార్యదర్శులు అనుపమ్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బసిరెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఈడీ కిశోర్ బాబు, యూఎఫ్ఓ, క్యూబ్ ప్రతినిధులు పాల్గొన్నట్టు తలసాని వెల్లడించారు.