పార్లమెంటు ఉభయ సభల్లో జగన్‌కు దక్కిన గౌరవమిది: వైసీపీ ఎంపీ మార్గాని భరత్
- లోక్ సభ ప్యానెల్ స్పీకర్‌గా మిధున్ రెడ్డి
- రాజ్యసభ ప్యానెల్ చైర్మన్‌గా సాయిరెడ్డి
- ఉభయ సభలను ఇద్దరూ నడిపించిన వైనం
- అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేసిన మార్గాని
పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కిందంటూ ఆ పార్టీ యువ నేత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ శుక్రవారం చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన రెండు ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు.
లోక్ సభలో ప్యానెల్ స్పీకర్‌గా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇటీవలే లోక్ సభను కొద్దిసేపు నడిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గురువారం రాజ్యసభ ప్యానెల్ చైర్మన్ హోదాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రాజ్యసభను కాసేపు నడిపించారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసిన మార్గాని భరత్... ఈ తరహా పరిణామం ఉభయ సభల్లో జగన్‌కు, వైసీపీకి దక్కిన గౌరవమేనని పేర్కొన్నారు.