నాణ్యత లేని కుక్కర్లు అమ్మినందుకు అమెజాన్ కు జరిమానా!
- రూ. లక్ష కట్టాలని ఆదేశించిన కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ
- 2,265 కుక్కర్లను వెనక్కి తీసుకుని డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశం
- నాణ్యతా ప్రమాణాలు, వినియోగదారుల హక్కుల పట్ల నిర్లక్ష్యం సరికాదని వ్యాఖ్య
ఏమాత్రం నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లను విక్రయించినందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కు కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) తీవ్రంగా మండిపడింది. సదరు ప్రెషర్ కుక్కర్లు అన్నింటినీ వెంటనే వినియోగదారుల నుంచి వెనక్కి తీసుకుని.. డబ్బులను తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. అంతేగాకుండా ఈ వ్యవహారంలో నిర్లక్ష్యానికి సంబంధించి లక్ష రూపాయలు జరిమానా కట్టాల్సిందిగా ఆదేశించింది.
ఓ వినియోగదారు ఫిర్యాదుతో..
అమెజాన్ లో ఆర్డర్ చేసిన ఓ ప్రెషర్ కుక్కర్ నాణ్యతకు సంబంధించి ఒక కొనుగోలుదారు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన వినియోగదారుల ఫోరం ప్రెషర్ కుక్కర్ కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అమెజాన్ ను కోరింది. ఆ వివరాలు అందాక పరిశీలన జరిపిన అధికారులు.. అవి నాణ్యతా ప్రమాణాల మేరకు లేవని గుర్తించారు. అమెజాన్ ను పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించారు. మెల్లగా ఈ అంశం కేంద్ర వినియోగదారుల ఫోరానికి చేరింది. ఆధారాలను పరిశీలించి, వాదనలు విన్న కేంద్ర ఫోరం.. తాజాగా తీర్పు ఇచ్చింది.
కొనుగోలు దార్లకు సమాచారం ఇవ్వండి
ఈ తరహా ప్రెషర్ కుక్కర్లను 2,265 మంది వినియోగదారులకు అమ్మినట్టు గుర్తించిన వినియోగదారుల ఫోరం.. వారందరికీ ఈ విషయంపై సమాచారం ఇవ్వాలని అమెజాన్ ను ఆదేశించింది. సదరు వినియోగదారుల నుంచి నాసిరకం కుక్కర్లను వెనక్కి తీసుకుని, డబ్బులను రిఫండ్ చేయాలని సూచించింది.

- నాణ్యతా ప్రమాణాలను, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినందుకు రూ.లక్ష జరిమానాగా కట్టాలని అమెజాన్ ను ఆదేశించింది.
- కాగా 2,265 ప్రెషర్ కుక్కర్లను తమ ప్లాట్ ఫాంపై విక్రయించడం ద్వారా అమెజాన్ రూ.6,14,825 మేర కమీషన్ పొందడం గమనార్హం.