ఢిల్లీలో కలకలం రేపిన టిఫిన్ బాక్సు
- ప్రశాంత్ విహార్ వద్ద టిఫిన్ బాక్సు
- తనిఖీలు చేసిన బాంబు స్క్వాడ్
- ప్రమాదమేమీ లేదని స్పష్టీకరణ
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ప్రశాంత్ విహార్ వద్ద ఓ టిఫిన్ బాక్సు కలకలం రేపింది. అందులో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని స్థానికులు హడలిపోయారు. మరికొన్నిరోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనను భద్రతా బలగాలు తీవ్రంగా పరిగణించాయి. వెంటనే ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.
అధికారులు వెంటనే స్పందించి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను ప్రశాంత్ విహార్ కు తరలించారు. టిఫిన్ బాక్సును తనిఖీ చేసిన బాంబు స్క్వాడ్ ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. అనుమానించదగ్గ పదార్థాలేవీ అందులో లేవని తేల్చింది. ముందు జాగ్రత్తగా ప్రశాంత్ విహార్ వద్దకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ జీ) బలగాలను కూడా తరలించారు. అగ్నిమాపక దళ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు.
ఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో లష్కరే తోయిబా ముష్కరమూక ఉగ్రవాద దాడులు జరిపే అవకాశముందన్న ఐబీ సమాచారంతో ఢిల్లీ పోలీసులు గత కొన్నిరోజులుగా అత్యంత అప్రమత్తంగా వున్నారు.