కమాండ్ కంట్రోల్ బాస్ సీవీ ఆనంద్... సెంటర్‌లో కేసీఆర్‌కు స్పెషల్ చాంబర్
- కమాండ్ కంట్రోల్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్
- అభినందించిన సీఎం కేసీఆర్
- తనకు కేటాయించిన చాంబర్‌ను పరిశీలించిన కేసీఆర్
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈ రోజు రాష్ట్ర పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ)ను ప్రారంభించిన సంగతి విదితమే. భవన నిర్మాణం, భవనంలోని అత్యాధునిక సౌకర్యాలు, నేరాల అదుపునకు పోలీసులు తీసుకునే చర్యలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి.
రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన కమాండ్ కంట్రోల్ అయినప్పటికీ... దీనికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అధిపతిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఈ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించిన తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ బాస్‌గా ప్రస్తుతం నగర పోలీస్ కమిషనర్‌గా కొనసాగుతున్న సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్‌కు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ సెంటర్‌లో సీఎం కేసీఆర్‌కు కూడా ఓ ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. విపత్తుల సమయంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ శాఖ కేంద్రంగానే పోలీసు శాఖ చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఈ సెంటర్‌తో అనుసంధానం అయి ఉంటాయి. దీంతోనే ఎప్పుడైనా సీఎం హోదాలో కేసీఆర్ సెంటర్‌కు వచ్చే అకాశాలు ఉన్నందున ఆయనకు ఓ ప్రత్యేక ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. తనకు కేటాయించిన చాంబర్‌ను సందర్శించిన కేసీఆర్ అక్కడే కొద్దిసేపు గడిపారు.