ఏం చేసుకున్నా... మోదీకి భయపడేది లేదు: రాహుల్ గాంధీ
- విపక్షాల గొంతు నొక్కేందుకే ఈడీ సోదాలన్న రాహుల్
- నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా బెదిరింపు చర్యేనని ఆరోపణ
- ఒత్తిడి చేస్తే సైలెంట్ గా ఉండే ప్రసక్తే లేదని వ్యాఖ్య
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులతో తమను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ... గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చేసుకున్నా.. వారికి తాము భయపడేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోదాల తర్వాత యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఈడీ సీజ్ చేసిన వైనంపై స్పందించిన రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈడీ సోదాలు, దాడులు, విచారణల పేరిట విపక్షాల గొంతును నొక్కేందుకు కేంద్రం యత్నిస్తోందని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా బెదిరింపు చర్యేనని రాహుల్ తేల్చేశారు. తమపై చిన్నగా ఒత్తిడి తీసుకుని వస్తే..తామంతా సైలెంట్‌గా ఉంటామని మోదీ, అమిత్ షా భావిస్తున్నారన్న రాహుల్... అది ఎప్పటికీ జరగదని చెప్పారు. ఈడీతోనే కాకుండా ఇంకెన్ని సంస్థలతో విచారణలు, సోదాలు చేయించినా... మోదీ, అమిత్ షాలు ఎన్ని చేసినా తాము భయపడే ప్రసక్తే లేదని రాహుల్ చెప్పారు.