ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద కారులోంచి పడిపోయిన చిన్నారి.. సీసీ కెమెరా ఫుటేజీ వీడియో ఇదిగో!

  • అది గమనించకుండా గ్రీన్ సిగ్నల్ పడగానే ముందుకు వెళ్లిపోయిన చిన్నారి కుటుంబ సభ్యులు
  • ఆమె పక్క నుంచి దూసుకెళ్లిన మరికొన్ని వాహనాలు
  • ఓ వ్యక్తి కారును ఆపడంతో.. మిగతా వాహనాల వారూ ఆగి పాపను రక్షించిన వైనం
అది చైనాలోని నింగ్ బో నగరం.. నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే ఓ జంక్షన్.. రెడ్ సిగ్నల్ పడటంతో ఓ కారు ఆగింది.. దాని విండో నుంచి ఓ చిన్నారి తల బయటికి పెట్టి అటూ ఇటూ చూడటం మొదలుపెట్టింది. కాసేపటికి మరింతగా బయటికి వంగి చూసింది. అప్పుడే గ్రీన్ సిగ్నల్ పడటంతో.. కారులోని చిన్నారి కుటుంబ సభ్యులు ముందుకు పోనిచ్చారు. దీంతో విండోలోంచి వంగి చూస్తున్న చిన్నారి జారి నడి రోడ్డుపై పడిపోయింది. చిన్నారి కుటుంబ సభ్యులు దీన్ని గమనించకుండానే సిగ్నల్ దాటేసి ముందుకు వెళ్లిపోయారు.

వేగంగా వస్తున్న కార్ల మధ్య..
చిన్నారి పాప రోడ్డుపై పడటంతో దెబ్బ తగిలి అలాగే ఉండిపోయింది. అప్పటికే సిగ్నల్ పడి ఉండటంతో వాహనాలన్నీ వేగంగా దూసుకుపోవడం మొదలుపెట్టాయి. కొన్ని వాహనాలు ఆమె పక్కగా వెళ్లాయి కూడా. అయితే ఆ పాప పడిపోయిన లేన్ లో వస్తున్న ఓ కారులోని వ్యక్తి పాపను చూసి.. కారు ఆపేశాడు. దాని పక్కగా వస్తున్న మరికొన్ని కార్లలోని వారు కూడా సిగ్నల్ వద్ద నడి రోడ్డుపైనే ఆపేశారు.
  • ఓ కారులోని ఆయన వేగంగా కిందికి దిగి చిన్నారి పాపను ఎత్తుకుని రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది.
  • ఎవరో ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
  • పాప పడిపోతే అలా చూడకుండా ఎలా వెళ్లిపోయారని కామెంట్లలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. చిన్నారిని కాపాడిన వాహనదారులను మరికొందరు మెచ్చుకుంటున్నారు.


More Telugu News