విద్యార్థినులపై లైంగిక దాడి.. టీచర్ కు 79 ఏళ్ల జైలు

  • కేరళలోని తాలిపరంబ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు 
  • తరగతి గదిలో సాయం పేరుతో అకృత్యాలు
  • నాలుగు, ఐదో తరగతికి చెందిన నలుగురు విద్యార్థినులపై దాడి
పూజించే స్థానంలో ఉన్న ఓ టీచర్, విలువలు మరిచి విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఈ మేరకు అభియోగాలు నిర్ధారణ కావడంతో కేరళలోని తాలిపరంబ ఫాస్ట్ ట్రాక్ పోస్కో కోర్టు నిందితుడు పీఈ గోవిందన్ నంబూద్రి (50)కి 79 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పు ప్రకటించింది. అలాగే రూ.2.7 లక్షల జిరిమానా కూడా చెల్లించాలని జడ్జి ముజీబ్ రెహమాన్ ఆదేశాలు జారీ చేశారు.

కన్నూరులోని లోయర్ ప్రైమరీ స్కూల్లో 4, 5వ తరగతులకు చెందిన నలుగురు విద్యార్థినులపై లెక్కల మాస్టార్ అయిన నంబూద్రి తరచుగా లైంగిక దాడులు చేసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. 2013 జూన్ నుంచి 2014 ఫిబ్రవరి మధ్య అతడు చేసిన దారుణాలు బయటకు వచ్చాయి. తరగతి గదిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం పేరుతో వారిపై లైంగిక చర్యలకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.


More Telugu News