దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. 53 మంది మృతి.. అప్టేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో 19,893 కేసుల నమోదు
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,478
  • 98.50 శాతానికి పెరిగిన రికవరీ రేటు
మన దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 19,893 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి ముందు రోజు 17,135 కేసులు వచ్చాయి. మరోవైపు గత 24 గంటల్లో 20,419 మంది కోలుకున్నారు. 53 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 1,36,478 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,40,87,037 మంది కరోనా బారిన పడగా... వీరిలో 4,34,24,029 మంది కోలుకున్నారు. మొత్తం 5,26,530 మంది కరోనాకు బలయ్యారు. 

ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.3 శాతంగా, క్రియాశీల రేటు 0.31 శాతంగా, రికవరీ రేటు 98.50 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,05,22,51,408 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 38,20,676 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.


More Telugu News