మాలెగావ్ పేలుళ్ల కేసు: ఆ స్కూటర్ ప్రజ్ఞాసింగ్‌దేనన్న ఫోరెన్సిక్ నిపుణుడు
- 29 సెప్టెంబరు 2008న మాలేగావ్‌లో పేలుళ్లు
- ఆరుగురి మృతి.. 100 మందికిపైగా గాయాలు
- కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చిన 261వ సాక్షి
- బాంబును అమ్మోనియం నైట్రేట్‌తో చేశారన్న ఫోరెన్సిక్ నిపుణుడు
మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టులో సాక్షిగా ఉన్న ఓ ఫోరెన్సిక్ నిపుణుడు నిన్న కోర్టులో వాంగ్మూలం ఇస్తూ పేలుడు ప్రదేశంలో స్కూటర్ శకలాలను గుర్తించామని, అది ప్రజ్ఞాసింగ్ పేరున రిజిస్టర్ అయి ఉందని తెలిపారు. 29 సెప్టెంబరు 2008లో మాలేగావ్‌లో జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో 261వ సాక్షిగా ఉన్న ఫోరెన్సిక్ నిపుణుడు నిన్న ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.
ఈ కేసు దర్యాప్తులో సహాయ రసాయన విశ్లేషకుడిగా ఉన్న ఆయన వాంగ్మూలం ఇస్తూ.. పేలుడు జరిగిన ప్రదేశంలో ఎల్ఎంఎల్ వెస్పా స్కూటర్ శకలాలను తాను గుర్తించానని, వాటిని సేకరించి రసాయన పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. స్కూటర్‌పైనే పేలుడు పదార్థాల ఆనవాళ్లను గుర్తించినట్టు చెప్పారు. అలాగే, పేలుడు కోసం స్కూటర్‌ను ఉపయోగించడానికి ముందు దాని ఇంజిన్ నంబరును చెరిపేశారని చెప్పారు. అమ్మోనియం నైట్రేట్‌తో బాంబును తయారుచేశారని తేలిందని కోర్టుకు వివరించారు.