'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో విరాట్ కోహ్లీ
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా యాత్ర
- ఢిల్లీలో ఉత్సాహంగా పాలుపంచుకున్న కేంద్ర మంత్రులు
- వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ ఫొటో
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారీ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం 'హర్ ఘర్ తిరంగా' పేరిట బీజేపీ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో బీజేపీకి చెందిన కీలక నేతలతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
ఇదిలా ఉంటే... 'హర్ ఘర్ తిరంగా'లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా పాలుపంచుకున్నాడు. టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తుండగా... ఈ సిరీస్ నుంచి కాస్తంత విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఢిల్లీలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా బ్యాక్ డ్రాప్‌గా నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాడు. సోషల్ మీడియాలో చేరిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.