గవర్నర్ తమిళిసైతో తెలంగాణ వర్సిటీల విద్యార్థుల భేటీ
- రాజ్‌భవన్‌కు వచ్చిన బాసర ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా వర్సిటీ, వరంగల్ నిట్, తెలంగాణ వర్సిటీ విద్యార్థులు
- విద్యాలయాల్లోని సమస్యలపై గవర్నర్‌కు వినతి పత్రం సమర్పణ
- సమస్యలను పరిష్కరించేలా చూడాలని అభ్యర్థన
తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు బుధవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా వర్సిటీ, వరంగల్ నిట్, తెలంగాణ వర్సిటీలకు చెందిన విద్యార్థులు మూకుమ్మడిగా బుధవారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు. వసతుల లేమి, నాసిరకం భోజనం, ఆయా విద్యా సంస్థలకు రెగ్యులర్ వీసీలు లేని పరిస్థితులపై వారంతా గవర్నర్‌కు వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థులు గవర్నర్‌ను కోరారు.