ఏ క్షణమైనా పిడుగు పడొచ్చంటూ తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
- టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న తుమ్మల
- కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపు
- ముందస్తు ఎన్నికల నిర్ణయం జరిగిందా అన్న విశ్లేషణలు
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌లో కీలక నేతగా కొనసాగుతున్న మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని చెప్పిన తుమ్మల... కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని తుమ్మల వ్యాఖ్యానించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల దిశగా ఏదైనా కీలక నిర్ణయం తీసుకుందా? అన్న దిశగా చర్చ సాగుతోంది. ఇప్పటికే 2018లో మాదిరిగానే ఈ దఫా కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారని విపక్షాలు చెబుతుండగా... టీఆర్ఎస్ మాత్రం ముందస్తు ముచ్చటే లేదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చంటూ తుమ్మల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.