'ఇష్టలింగ దీక్ష'ను తీసుకున్న రాహుల్ గాంధీ.. రాహుల్ ప్రధాని అవుతారన్న మఠంలోని స్వామి
- కర్ణాటకలోని మురుగరాజేంద్ర మఠంలో దీక్ష తీసుకున్న రాహుల్
- మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణారు చేతుల మీదుగా దీక్ష
- ఎంతో ఆనందంగా ఉందన్న రాహుల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దైవభక్తి ఎక్కువనే చెప్పుకోవాలి. క్రమం తప్పకుండా ఆయన దేవాలయాలను సందర్శిస్తుంటారు. ముఖ్యంగా తాను శివ భక్తుడిని అని ఆయన చెప్పుకుంటుంటారు. తాజాగా ఈరోజు ఆయన కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న శ్రీ మురుగరాజేంద్ర మఠంలో 'ఇష్టలింగ దీక్ష'ను తీసుకున్నారు.
ఈ విషయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణారు చేతుల మీదుగా ఆయన దీక్షను స్వీకరించారు. దీక్ష తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. స్వామి గురు బసవన్న బోధనలు ఎప్పటికీ నిలిచి పోతాయని... వాటి గురించి తాను తెలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
మరోవైపు ఈ కార్యక్రమం సందర్భంగా మఠంలోని స్వాముల్లో ఒకరైన హవేరీ హొసమఠ్ స్వామి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కచ్చితంగా ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా శివమూర్తి శరణారు కల్పించుకుంటూ... తమ మఠానికి ఎవరు వచ్చినా వారికి మంచి జరుగుతుందని అన్నారు.