ఎంపెడా సభ్యురాలిగా వైసీపీ ఎంపీ వంగా గీత... ఏపీకి ఎంతో లాభమన్న సాయిరెడ్ది
- వంగా గీతను ఎంపెడా సభ్యురాలిగా నియమించిన కేంద్రం
- భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయన్న సాయిరెడ్డి
- కాకినాడ తీరానికి మరింత లబ్ధి జరుగుతుందని వెల్లడి
వైసీపీ మహిళా నేత, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతకు ఓ కీలక పదవి దక్కింది. మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంపీఈడీఏ-ఎంపెడా)లో ఆమెను సభ్యురాలిగా నియమిస్తూ బుధవారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలిసినంతనే వైసీపీ ఎంపీలంతా వంగా గీతను అభినందించారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం వైసీపీపీ కార్యాలయంలో వంగా గీతకు ఆ పార్టీ ఎంపీలు అభినందనలు తెలిపారు.
ఎంపెడా సభ్యురాలిగా వంగా గీతకు అవకాశం దక్కడంపై వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వంగా గీత ఎంపెడా సభ్యురాలిగా ఎంపిక కావడంతో ఏపీతో పాటు భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అభివృద్ధి చెందనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాకినాడలో 150 కిలో మీటర్ల మేర ఉన్న తీర ప్రాంతానికి మరింత లబ్ధి జరగనుందని ఆయన పేర్కొన్నారు.