9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నా: బరాక్ ఒబామా

  • అల్ ఖైదా చీఫ్ జవహరిని హత మార్చిన అమెరికా
  • యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని పెకిలించివేయొచ్చన్న ఒబామా
  • ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా యూఎస్ నిఘా వర్గాలు కృషి చేశాయని వ్యాఖ్య
అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా అంతం చేసిన సంగతి తెలిసిందే. డ్రోన్ దాడితో ఆయనను హతమార్చింది. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయవచ్చని చెప్పడానికి అల్ జవహరి ఘటనే ఉదాహరణ అని చెప్పారు. 

జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఒక్క సాధారణ పౌరుడి ప్రాణానికి కూడా హాని కలగకుండా జవహరిని అంతం చేసినందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ పై ప్రశంసలు కురిపించారు. ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా అమెరికా నిఘా వర్గాలు కృషి చేశాయని కొనియాడారు.


More Telugu News